కలం వెబ్ డెస్క్ : హైడ్రా కమిషనర్ రంగనాథ్(Hydra Commissioner Ranganath) గన్‌మెన్ కృష్ణ చైతన్య(Gunman Chaitanya) ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయం తన నివాసంలో కానిస్టేబుల్ చైతన్య తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. పరిస్థితి విషమించడంతో కామినేని ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆస్పత్రి వద్దకు చేరుకొని చైతన్య పరిస్థితిపై వైద్యులను అడిగి ఆరా తీశారు. ఆర్థిక సమస్యల వల్లే కృష్ణ చైతన్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని రంగనాథ్ తన స్టేట్మెంట్ ఇచ్చారు.
రంగనాథ్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కృష్ణ చైతన్య తండ్రి శివరాం ప్రసాద్(Shivaram Prasad) మరోలా స్పందించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆర్థిక సమస్యలు, బెట్టింగ్ వల్లే కృష్ణ చైతన్య ఆత్మహత్యయత్నం చేశాడని వస్తున్న వార్తలను శివరాం ప్రసాద్ ఖండించారు. తమకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని, తన కుటుంబం ఆర్థికంగా బలంగా ఉందని చెప్పారు. అలాగే బెట్టింగ్ యాప్స్(Betting Apps), గేమింగ్ యాప్స్(Gaming Apps) లాంటి అలవాట్లు కూడా తమ కుమారుడికి లేవన్నారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతుందని, అసలు ఎందుకు ఆత్మహత్యాయత్నం చేయాల్సి వచ్చిందో తెలియాల్సి ఉందని చెప్పారు. ఎలాంటి ఆర్థిక ఇబ్బంది లేనప్పుడు ఆత్మహత్య ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది, రంగనాథ్ ఎందుకు ఆర్థిక సమస్యల వల్లే చైతన్య(Gunman Chaitanya) సూసైడ్‌కు యత్నించాడన్నారనే విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఎవరి మాటల్లో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది. తన వెటన ఇంటికి తీకొచ్చిన గన్ మిస్ ఫైర్ అయిందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
Read Also: ప్రేమపేరుతో వల.. అమ్మాయిలతో డ్రగ్స్ దందా..
Follow Us On: Instagram


