కలం వెబ్ డెస్క్ : బిగ్ బాస్ తెలుగు(Bigg Boss Telugu) సీజన్ 9 ముంగింపు దశకు చేరుకుంది. గ్రాండ్ ఫినాలే(Grand Finale)కి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉండటంతో టైటిల్ విజేత(winner) ఎవరనే దానిపై ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం హౌస్‌లో టైటిల్ కోసం కళ్యాణ్ పడాల(Kalyan Padala), తనూజ, ఇమ్మాన్యుయేల్,డెమోన్ పవన్,సంజన గల్రానీ పోటీ పడుతున్నారు.ఇప్పటికే, కళ్యాణ్ పడాల టైటిల్ విన్నర్ అయ్యండంటూ సోషల్ మీడియాలో ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.
కళ్యాణ్(Kalyan) వైపు మొగ్గు ఎక్కువగా ఉన్నప్పటికీ, తనూజ(Thanuja) ఆర్మీ కూడా సైలెంట్‌గా ఓటింగ్ పెంచుకుంటూ వస్తోంది. అంతేకాదు.. వీరిద్దరి మధ్య ఓట్ల శాతం కూడా చాలా తక్కువ ఉండటంతో విజేత విషయంలో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలోనే విన్నర్ విషయంలో ఊహించని ట్విస్ట్ ఇవ్వబోతున్నారట బిగ్ బాస్. అంతా కళ్యాణ్ అంటున్నారు కానీ.. అలా అనుకున్న వాళ్లకి బిగ్ బాస్ షాక్ ఇవ్వబోతున్నట్లుగా టాక్ వైరల్ అవుతుంది.ఈ ఫేక్ ఓట్లు టాప్-5లో ఉన్న అందరికీ పడ్డాయని బిగ్ బాస్(Bigg Boss Telugu) అంటున్నారు. అందువల్ల ఈ ఓట్ల ఆడిటింగ్ తర్వాత రిజల్ట్ తారుమారు కావొచ్చని అందరూ భావిస్తున్నారు.
Read Also: రూటు మార్చిన రామ్..?
Follow Us On: Youtube


