తిరుమ‌ల కొండ‌పై హెలీకాఫ్ట‌ర్ చ‌క్క‌ర్లు.. భ‌క్తుల ఆగ్ర‌హం

క‌లం, వెబ్ డెస్క్: తిరుమ‌ల (Tirumala) కొండ‌పై మ‌రోసారి హెలీకాఫ్ట‌ర్ చ‌క్క‌ర్లు కొట్ట‌డం క‌ల‌క‌లం రేపింది. బుధ‌వారం ఉద‌యం ఓ హెలీకాఫ్ట‌ర్ కొండ మీదుగా వెళ్ల‌డంపై భ‌క్తులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. తిరుమ‌ల‌ ఆగమశాస్త్ర నిబంధ‌న‌ల ప్ర‌కారం ఆల‌యం పై నుంచి డ్రోన్లు, విమానాలు, హెలీకాఫ్ట‌ర్లు ప్ర‌యాణించ‌డం నిషేధం. అయిన‌ప్ప‌టికీ త‌ర‌చూ నిబంధ‌న‌ల‌ ఉల్లంఘన జ‌రుగుతోంద‌ని భ‌క్తులు మండిప‌డుతున్నారు. ప‌దే ప‌దే ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌డంపై టీటీడీకి ఫిర్యాదులు చేస్తున్నామ‌ని, అయినా ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని చెప్తున్నారు. టీటీడీ, ఏవియేష‌న్ అధికారులు ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకొని, మ‌రోసారి ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా జాగ్ర‌త్త వ‌హించాల‌ని భ‌క్తులు డిమాండ్ చేస్తున్నారు.

Read Also: అనిత‌పై చేసిన వ్యాఖ్య‌ల‌పై త‌గ్గేదే లేదు: అమ‌ర్‌నాథ్‌

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>