కలం వెబ్ డెస్క్ : గుంటూరు జిల్లా మంగళగిరి(Mangalagiri)లో దారుణం చోటు చేసుకుంది. ఓ బాలిక(Minor Girl)పై నలుగురు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బాలికను బెదిరించారు. దీంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొద్దిరోజులుగా బాలిక ప్రవర్తనలో మార్పు రావవడంతో తల్లిదండ్రులు ఆరా తీశారు. బాలిక తనపై జరిగిన అఘాయిత్యాన్ని చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నలుగురు యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. అభంశుభం తెలియని తమ చిన్నారిపై దారుణానికి పాల్పడ్డ దుర్మారులను కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
Read Also: నిజామాబాద్‌లో మరో శిశు విక్రయం
Follow Us On: Pinterest


