కలం, వెబ్ డెస్క్ : బీమా డబ్బుల కోసం కన్నతండ్రినే కుమారులు హత్య (Sons Kill Father) చేయించిన అమానవీయ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తిరువళ్లూరు జిల్లాకు చెందిన గణేశన్ (56) స్థానిక గవర్నమెంట్ స్కూళ్లో ల్యాబ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. గత అక్టోబర్ నెలలో ఆయన పాము కాటుతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎలాంటి అనుమానాలు లేకపోవడంతో అప్పట్లో పోలీసులు కేసును సహజ మరణంగా రికార్డ్ చేశారు.
తరువాత గణేశన్ పేరు మీద చేయించిన బీమా పాలసీల కింద రూ.3 కోట్ల క్లెయిమ్ కోసం అతడి ఇద్దరు కొడుకులు బీమా సంస్థను సంప్రదించారు. అయితే, మృతుడిపై అధిక విలువ గల పలు బీమా పాలసీలు ఉండటం.. కుమారుల ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించింది. దీంతో బీమా సంస్థ అధికారులకు సందేహం కలగడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో కేసును తిరిగి చేపట్టిన పోలీసులు లోతుగా విచారించారు. కాగా విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బీమా డబ్బుల కోసమే ఇద్దరు కుమారులు పథకం పన్ని కుట్రలో భాగంగా తండ్రి పేరు మీద భారీ భీమా చేయించారు. అనంతరం పాముకాటుతో హత్య (Sons Kill Father) చేయించి ప్రమాదంగా చూపించే ప్రయత్నం చేశారు పోలీసులు నిర్ధారించారు. దీంతో నిందితులిద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు.
Read Also: ధర్మరాజునే మోసం చేసిన సైబర్ కేటుగాళ్లు
Follow Us On : WhatsApp


