కలం, వెబ్ డెస్క్ : లియోనెల్ మెస్సీ (Lionel Messi) గోట్ టూర్ ఇండియాలో ఎంత చర్చనీయాంశం అయిందో మనకు తెలిసిందే. కోల్ కత్తాలో మెస్సీ మ్యాచ్ క్యాన్సిల్ కావడంతో ఫ్యాన్స్ పెద్ద ఎత్తున గొడవ చేశారు. స్టేడియంలో జరిగిన గొడవపై బెంగాల్ ప్రభుత్వం ప్రత్యేక సిట్ వేసింది. ఈ వివాదంలో ప్రోగ్రామ్ నిర్వాహకుదు శతాద్రు దత్తాను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఆయన్ను విచారించగా మ్యాచ్ గురించి కీలక విషయాలను బయట పెట్టాడు.
‘తాము గ్రౌండ్ లోకి 100 మందికి మాత్రమే ఎంటర్ అయ్యేందుకు పాస్ లు ఇస్తే.. అంతకు మూడింతల మంది గ్రౌండ్ లోకి దూసుకొచ్చారని.. వాళ్లు షేక్ హ్యాండ్స్, హగ్గులు ఇవ్వడంతో లియోనెల్ మెస్సీ (Lionel Messi) అసౌకర్యానికి గురయ్యాడని తెలిపాడు శతాద్రు దత్తా. అందుకే మ్యాచ్ ఆడకుండా వెళ్లిపోయాడని స్పష్టం చేశాడు. ఇండియా టూర్ కోసం మెస్సీకి రూ.89 కోట్లు చెల్లించినట్టు బయటపెట్టాడు. మొత్తం రూ.100 కోట్ల టూర్ అయితే అందులో రూ.11 కోట్లు భారత ప్రభుత్వానికి కట్టామని శతాద్రు వెల్లడించాడు. ఇందులో చాలా వరకు స్పాన్సర్ల ద్వారానే సేకరించామని వివరించాడు.
Read Also: ధర్మరాజునే మోసం చేసిన సైబర్ కేటుగాళ్లు
Follow Us On: X(Twitter)


