కలం, వెబ్ డెస్క్ : రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో(LB Stadium) నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ద్వేషించే వారిని కూడా ప్రేమించే గుణాన్ని ఏసు ప్రభువు నింపారన్నారు. కాంగ్రెస్ పార్టీకి డిసెంబర్ ఒక మిరాకల్ మంత్ అని, రాజకీయంగా భారీ నష్టం జరిగిన్పటికి సోనియా గాంధీ (Sonia Gandhi) తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించారని తెలిపారు. ఇదే డిసెంబర్ లో తెలంగాణ ప్రజాప్రభుత్వం ఏర్పడిందని సీఎం గుర్తు చేశారు.
శాంతిని కాపాడుతూనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఏసు ప్రభువు బోధనల స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం స్పష్టం చేశారు. పేదల ఆకలి తీర్చాలని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆహార భద్రత చట్టం తెచ్చిందని చెప్పారు. ఇప్పుడు పేదవాడి ఆకటి తీరాలని నెలకు ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం అందిస్తున్నామన్నారు. ఉచిత కరెంట్ తో పేదల ఇళ్లల్లో వెలుగులు నింపామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఏసు ప్రభువు బోధనల స్పూర్తితో ప్రజా పాలన సాగిస్తున్నామన్నారు. ఇతర మతాలను కించపరిచే మాటలు మాట్లాడితే కఠిన చర్యలు తీసుకునేలా త్వరలో అసెంబ్లీలో కొత్త చట్టం తీసుకువస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండళ్లలోనే వ్యవసాయంపై రూ.1.04 లక్షల కోట్లు ఖర్చు పెట్టామని వెల్లడించారు. క్రిస్టియన్ మిషనరీలు ప్రభుత్వంతో పోటిపడి విద్య, వైద్యం అందించాయని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) కొనియాడారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు.
Read Also: వీకెండ్ డెస్టినేషన్ గా వరంగల్.. బ్రోచర్ ఆవిష్కరించిన కొండా సురేఖ
Follow Us On: Sharechat


