కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ నియంత్రణపై ఉక్కుపాదం మోపుతోంది. ఈగల్ ఫోర్స్ (Eagle Force) మెరుపు దాడులు నిర్వహిస్తోంది. మాదకద్రవ్యాల నియంత్రణకు చేపట్టిన ప్రత్యేక చర్యల్లో భాగంగా ఈగల్ ఫోర్స్ బృందాలు మెరుపుదాడులు నిర్వహించాయి. శనివారం రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న పెడ్లర్లపై ఈగల్ బృందం దాడులు నిర్వహించింది.
ఆపరేషన్‌లో మూడు కేసుల్లో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఈగల్ ఫోర్స్(Eagle Force) అధికారులు వెల్లడించారు. ఈ దాడుల్లో మొత్తం 330 గ్రాముల గంజాయి, 43 గ్రాముల కోకైన్, 11.5 గ్రాముల ఎండీఎంఏ మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ నిందితులు యువతను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ (Drugs) సరఫరా చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
వరంగల్‌లో ముగ్గురు గంజాయి సరఫరాదారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారి వద్ద నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మియాపూర్ (Miyapur) ప్రాంతంలో 250 గ్రాముల గంజాయితో ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇక మసాబ్‌ట్యాంక్‌లో (Masab Tank) డ్రగ్స్ విక్రయానికి యత్నిస్తున్న ఇద్దరిని పట్టుకుని వారి వద్ద నుంచి మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.
విచారణలో కీలకమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఏపీ–తెలంగాణ మధ్య అంతర్రాష్ట్ర డ్రగ్స్ నెట్‌వర్క్ పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్‌ను ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి తరలించి నగరాల్లో విక్రయిస్తున్నట్లు ఆధారాలు లభించినట్లు తెలిపారు. ఈ కేసులో మరికొందరు కీలక నిందితులు పరారీలో ఉన్నట్లు సమాచారం. వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు.
Read Also: డిసెంబర్ ఓ మిరాకిల్ మంత్ : సీఎం రేవంత్
Follow Us On: Youtube


