కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు సీపీ సజ్జనార్ (CP Sajjanar) షాక్ ఇచ్చారు. ఒకేసారి 80 మంది సిబ్బంది బదిలీ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్ఐ నుంచి కానిస్టేబుల్ ర్యాంకు ఉన్న అధికారులను అటాచ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కొందరు అధికారులు కొన్నేళ్లుగా టాస్క్ ఫోర్స్ డిపార్ట్ మెంట్ లోనే పాతుకుపోయారు. ఈ క్రమంలో ఇటీవల జరిగిన టాస్క్ ఫోర్స్ అధికారులపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఓ నిందితుడిని తప్పించేందుకు అధికారి భారీగా డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో టాస్క్ ఫోర్స్ విభాగంపై సీపీ సజ్జనార్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. దీంతో టాస్క్ ఫోర్స్ డిపార్ట్ మెంట్ ప్రక్షాళనకు సీపీ సజ్జనార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.
Read Also: వీకెండ్ డెస్టినేషన్ గా వరంగల్.. బ్రోచర్ ఆవిష్కరించిన కొండా సురేఖ
Follow Us On: Pinterest


