epaper
Friday, January 16, 2026
spot_img
epaper

తెలంగాణ బీజేపీకి ఏపీనే స్పూర్తి : బండి సంజయ్​

కలం, వెబ్​ డెస్క్​ : ఆంధ్రప్రదేశ్​ బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన మాజీ ప్రధాని వాజ్​పేయ్శతజయంతి ఉత్సవాల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay)​ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఆంధ్రప్రదేశ్​ చరిత్ర సృష్టించిందన్నారు. ప్రతీ జిల్లాలో వాజ్​పేయ్​ (Atal Bihari Vajpayee) విగ్రహాలు పెట్టడం అద్భతమని బండి సంజయ్​ కొనియాడారు. తాము తెలంగాణలో అధికారంలోకి వచ్చాకా ఇలానే చెస్తామన్నారు.

కూటమి(NDA) ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్​ అభివృద్ధి చెందుతున్నదని, ఏపీని స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణలో కూడా తాము అధికారంలోకి వస్తామని బండి సంజయ్​ ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో కాంగ్రెస్​ను కూకటివేళ్లతో పెకిలించి బంగాళఖాతంలో కలిపినట్లే తెలంగాణలోనూ ఆ పార్టీని బొంద పెడుతామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్​ బోర్లా పడిందని, ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతున్నదని ఆయన విమర్శించారు.

కేసీఆర్​ పాలనతో విసిగిన ప్రజలు కన్ఫ్యూజన్​ లో కాంగ్స్రెస్​కు ఓటు వేశారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. దీనివల్లే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. తెలంగాణలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు మోడీ నిధులే అందుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని బండి సంజయ్​ (Bandi Sanjay)​ వెల్లడించారు.

Read Also: గ్రామీణ ఉపాధిపై మోడీ బుల్‌డోజర్లు : సోనియా

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>