కలం వెబ్ డెస్క్ : కాంగ్రెస్ పార్టీ ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi)పై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించింది. ‘ఓట్ చోర్'(Vote Chor) అంటూ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ ఏఐ జనరేటెడ్ వీడియో(Congress AI Video)ను రిలీజ్ చేసింది. ఈ వీడియోలో మోడీ ప్రభుత్వం ప్రజల రాజ్యాంగబద్ధ హక్కులను హరించే ప్రయత్నాలు చేస్తోందని, ఓటు హక్కును ప్రశ్నార్థకం చేస్తోందని ఆరోపించింది.
మోడీ ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని భూస్థాపితం చేసిందని, గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని (MGNREGA) నీరుగార్చిందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. అటవీ హక్కుల చట్టాన్ని అటకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నారని, భూ హక్కుల చట్టాన్ని ఎత్తేసేలా ప్లాన్ చేస్తున్నారని ఆరోపించింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే, ఆహార భద్రత చట్టం కూడా కనుమరుగవుతుందని పేర్కొంది. ప్రజల హక్కులను హరించడమే మోడీ ప్రభుత్వ ఎజెండా అని వీడియో(Congress AI Video)లో ఆరోపించింది. ప్రజల గొంతును నొక్కేస్తున్నారని, ప్రశ్నించకుండా అణచివేస్తున్నారని విమర్శలు గుప్పించింది. దేశమంతా మోడీ తీరును గమనిస్తున్నదని, ఈ ‘తానాషాషీ’ వైఖరికి ప్రజలు సరైన సమయంలో బుద్ధి చెప్తారని పేర్కొంది.
Read Also: ఇమ్రాన్ ఖాన్ కు మరో 17 ఏళ్ల జైలు శిక్ష
Follow Us On: Youtube


