కలం, వెబ్ డెస్క్: త్వరలో క్రిస్మస్, న్యూ ఇయర్ (New Year) వేడుకలు ప్రారంభంకాబోతున్నాయి. దీంతో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ ప్రత్యేక ట్రైన్ (Special Trains) సర్వీసులను ప్రారంభించనుంది. దేశవ్యాప్తంగా ఎనిమిది జోన్లలో 244 ప్రత్యేక రైలు ప్రయాణాలను ఇప్పటికే ప్రకటించింది. ద.మ. రైల్వే పరిధిలో 26 స్పెషల్ ట్రైన్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
హైదరాబాద్-కాకినాడ, హైదరాబాద్-నర్సాపూర్, చర్లపల్లి-కాకినాడ, కాకినాడ-నాందేడ్, చర్లపల్లి-నర్సాపూర్, చర్లపల్లి-మంగుళూరు, చర్లపల్లి-ముంబై (లోకమాన్య తిలక్), చర్లపల్లి-కోల్‌కతా, చర్లపల్లి-మడ్‌గావ్ తదితర మార్గాల్లో ప్రత్యేక రైళ్లు (Special Trains) రాకపోకలు కొనసాగించనున్నాయి. ముంబయి-నాగపూర్, పుణె-సంగనర్, ఇతర మహారాష్ట్ర రూట్లలో తక్కువ ఖర్చుతో ప్రయాణించేలా రైల్వే శాఖ ఏర్పాటు చేసింది.
ద.మ రైల్వే ప్రాంతాల్లో హైదరాబాద్, బెంగళూరు, మంగళూరు, ఇతర నగరాలను కలుపుతూ ట్రైన్ సర్వీసులను నడపనుంది. రైల్వే శాఖ నిర్ణయంతో ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకోగలుగుతారు. పండుగ (Festival) సమయాల్లో రైల్వేపై భారం పడకుండా ఉంటుంది.
Read Also: మోడీ ఓట్ చోర్ అంటూ ఏఐ వీడియో విడుదల చేసిన కాంగ్రెస్
Follow Us On: X(Twitter)


