కలం వెబ్ డెస్క్ : బీఎస్ఎఫ్(BSF)లో అగ్నివీరుల నియామకంపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ(MoHA) కీలక నిర్ణయం తీసుకుంది. 10 శాతం ఉన్న అగ్నివీర్‌ల కోటా(Agniveer quota)ను 50 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
కేంద్రం 2022 లో ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంతో త్రివిధ దళాల్లో నాలుగేళ్ల సర్వీసు నిమిత్తం అగ్నివీర్‌లను నియమించుకుంటున్నారు. ఈ నాలుగేళ్ల సర్వీస్ అనంతరం భద్రతా బలగాల్లో రిజర్వేషన్ల ఆధారంగా వీరి నియామకాలు చేపడతారు. వీటిలో అగ్నివీర్‌లకు 10 శాతం కోటా మాత్రమే ఉంది. తాజా ఉత్తర్వులతో బీఎస్ఎఫ్‌లో కోటా 50 శాతానికి పెరిగింది.
Read Also: క్రిస్మస్, న్యూ ఇయర్ రష్.. దేశవ్యాప్తంగా 244 స్పెషల్ ట్రైన్స్ రయ్ రయ్
Follow Us On: X(Twitter)


