కలం, వెబ్ డెస్క్: ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో నాగర్‌కర్నూల్(Nagarkurnool) జిల్లాలోని గిరిజన మహిళ (Tribal Women) పురుషాల లింగమ్మ అమరగిరి గ్రామ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. లింగమ్మ వయస్సు 40 ఏళ్లు. అక్షరం ముక్క రాదు. బాల్యమంతా నల్లమల అడవుల్లో దశాబ్దాలుగా బానిసత్వంలో గడిపింది. దోపిడీదారులు ఆమెను బంధించి వలలు తయారుచేయించి మత్స్యకార్మికురాలిగా మార్చారు. ఎన్నో ఏళ్లుగా బానిసత్వంలో మగ్గింది. ఆమె తల్లిదండ్రులు కూడా బానిసత్వంలో మగ్గారు. ఆ తర్వాత ప్రభుత్వ అధికారులు గుర్తించి ఆమెను రక్షించారు.
“మేం వారికి ఎంత అప్పు ఇచ్చామో కూడా మాకు తెలియదు. వారు మాకు వలలు తెచ్చి ఇచ్చేవారు. రోజుల తరబడి చేపలు పట్టడానికి వెళ్లేవాళ్లం. ఆ రోజుల్లో మాకు తినడానికి ఆహారం కూడా ఉండేది కాదు” అని చెప్పింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో (Elections) దాదాపు 300 జనాభా ఉన్న ఆ గ్రామాన్ని ఎస్టీలకు రిజర్వ్ చేశారని ఆమె తెలుసుకున్నారు. లింగమ్మ గృహనిర్మాణంలో కార్మికురాలిగా పనిచేయడం, పలు సంక్షేమ కార్యక్రమాలు తెలిసి ఉండటంతో అధికారులు ఆమెను ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రోత్సహించారు.
Nagarkurnool | ఆమె తమ్ముడు ఎన్నికల్లో పోటీ చేయొద్దని వ్యతిరేకించాడు. అయినా ధైర్యంగా బరిలోకి దిగి విజయం సాధించింది. అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తున్న తన కుమార్తెను కూడా తాను చదివించానని లింగమ్మ చెప్పారు. గ్రామంలో రోడ్లు, నీరు, విద్యుత్తు సౌకర్యాలను మెరుగుపరచడానికి కృషి చేయాలనుకుంటున్నానని లింగమ్మ (Lingamma) చెప్పారు.
Read Also: తిరిగి గులాబీ గూటికి శానంపూడి..
Follow Us On: Pinterest


