epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ర‌ఘురామ కృష్ణంరాజు అరెస్ట్ కాబోతున్నారు… పీవీ సునీల్ కుమార్ సంచ‌ల‌న ట్వీట్‌!

క‌లం వెబ్ డెస్క్ : ఏపీ అసెంబ్లీ డిప్యుటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు(Raghurama Krishna Raju)పై సీబీఐ దర్యాప్తు(CBI Investigation) జరుగుతున్న నేపథ్యంలో, ఆయన అరెస్ట్(Arrest) కావడం ఖాయమంటూ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్(PV Sunil Kumar) సంచలన ట్వీట్ చేశారు. రూ.945 కోట్ల చీటింగ్ కేసులో రఘురామ, ఆయన కుటుంబసభ్యులు ప్రమేయం ఉన్నట్లు సీబీఐ ఎఫ్‌ఐఆర్‌(FIR)లో పేర్కొందని ఆయన వెల్లడించారు.

సుప్రీం కోర్టు(Supreme Court) ఇటీవల ర‌ఘురామ‌, ఆయన కుటుంబసభ్యుల అరెస్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. “గజ దొంగ, చీటర్” అంటూ ర‌ఘురామ‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ డిప్యూటీ స్పీక‌ర్ హోదాలో ఉన్న ర‌ఘురామ అరెస్ట్ అయితే రాష్ట్రానికే త‌ల‌వంపులు అని, అమరావతి(Amaravati) రాజధాని బ్రాండ్‌కు ఇది తీవ్ర న‌ష్టాన్ని క‌లిగిస్తుంద‌న్నారు. రాష్ట్రానికి వ‌చ్చే పెట్టుబడులు వెనక్కి పోతాయని హెచ్చరించారు. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి నారా లోకేష్ వంటి నాయకులు కష్టపడి తెచ్చే పెట్టుబడులు దెబ్బతినకుండా చూడాలని సూచించారు. కేసు దర్యాప్తు ముగిసి, కోర్టు విచారణ పూర్తయ్యే వరకు ర‌ఘురామ‌కు ఎలాంటి పదవులు ఇవ్వకూడదని సూచించారు.

Read Also: అడవి బిడ్డ అరుదైన ఘనత.. నాడు బానిస కూలీ, నేడు సర్పంచ్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>