కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో(Panchayat Elections) పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల పనితీరుపై మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ పోరులో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాల్లో విజయం సాధించినప్పటికీ, రెబల్స్‌ను బుజ్జగించకపోవడం, సమన్వయ లోపాలతో గెలవాల్సిన స్థానాల్లో ఓటమి పాలవడంపై తెలంగాణ ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ సహా నాయకత్వం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వరంగల్, నల్గొండ, పాలమూరు జిల్లాలకు చెందిన నేతల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తం 18 నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారు. భవిష్యత్‌లో ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా చూడాలని హెచ్చరించారు.
సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud), ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan)లు పంచాయతీ ఎన్నికల ఫలితాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సాధించిన విజయాలతో పాటు ఓటమి పాలైన స్థానాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. మొత్తం 12,733 సర్పంచ్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు 7,010 స్థానాలు గెలుచుకున్నారు. బీఆర్‌ఎస్ 3,502, బీజేపీ 688 స్థానాల్లో విజయం సాధించాయి.
Read Also: తిరిగి గులాబీ గూటికి శానంపూడి..
Follow Us On: Instagram


