Mobile Popup Ad
Mobile Popup Ad

స్నేహా సొసైటీ ఆశయం చాలా గొప్పది : మేయర్ ఉమారాణి

కలం, నిజామాబాద్ బ్యూరో : స్నేహ సొసైటీ ఆశయం చాలా గొప్పదని.. మానసిక దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపుతోందని మేయర్ ఉమారాణి (Mayor Umarani) అన్నారు. స్నేహ సొసైటీకి తన వంతు సహకారం అందజేస్తానని ఉమారాణి హామీ ఇచ్చారు. నిజామాబాద్ (Nizamabad) జిల్లా కేంద్రంలోని మారుతి నగర్ స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్ స్ట్రక్షన్ దివ్యాంగుల స్కూల్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మేయర్ ఉమారాణి, సీనియర్ వైద్యులు ప్రతిమా రాజ్, గైనకాలజిస్ట్ బండారి సుజాత, నిజామాబాద్ అర్బన్ సిడిపివో సౌందర్య, మహిళా జర్నలిస్టు సంగీత తదితరులు హాజరయ్యారు.

మేయర్ ఉమారాణి (Mayor Umarani) మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. స్నేహ సొసైటీ ప్రిన్సిపాల్ జ్యోతి చేస్తున్న సేవలను అభినందించారు. ఇక్కడ చదివే దివ్యాంగ విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుంటున్నారని చెప్పారు. సీనియర్ వైద్యులు ప్రతిమారాజ్ మాట్లాడుతూ.. ప్రతి ఆడపిల్ల లక్ష్యంతో కష్టపడి జీవితంలో ముందుకు సాగినప్పుడే ఉన్నత స్థాయిలో రాణిస్తారని తెలిపారు. మౌంట్ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన ఘనత దివ్యాంగ మహిళకే దక్కిందన్నారు. భగవంతుడు దివ్యాంగులకు ఒక లోపం ఇచ్చినప్పటికీ పదింతల మేదో సంపత్తి ఇచ్చినట్టు చెప్పారు.

డాక్టర్ బండారి సుజాత ప్రముఖ గైనకాలజిస్ట్, అర్బన్ సిడిపిఓ సౌందర్య మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో నిలదొక్కుకోవడానికి చదువు చాలా ముఖ్యమన్నారు.. లక్ష్యం, శ్రమ, పట్టుదలతో మహిళలు ముందుకెళ్తే ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని సూచించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులైన మహిళా జర్నలిస్టు బైస సంగీత, వీరనేని రమాదేవి, బొడ్డు లక్ష్మీదేవి, అందుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపల్ జ్యోతి, ప్రిన్సిపల్ మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి, లత, తీరునగరి విరజ, సుధా వేరోనిక, ఏ రాజ్యలక్ష్మి డి సునీత తదితరులు పాల్గొన్నారు.

Read Also: గ్యాస్​ మంటలు.. సామాన్యుల తంటాలు

Follow Us On: Sharechat

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>