Mobile Popup Ad
Mobile Popup Ad

ప్ర‌కృతి సేద్యంతో అద్భుతాలు.. గుంటూరు రైతుకు సీఎం ప్ర‌శంస‌లు!

క‌లం, వెబ్ డెస్క్‌: ప్ర‌కృతి సేద్యం (Natural Farming)తో సాగులో అద్భుతాలు సృష్టిస్తున్న ఓ రైతు శ్ర‌మ‌ను సీఎం చంద్ర‌బాబు (CM Chandrababu) గుర్తించి ప్ర‌శంసించారు. వ్య‌వ‌సాయంపై మ‌మ‌కారంతో 80 ఏళ్ల వ‌య‌స్సులోనూ ఎంతో క‌ష్ట‌ప‌డి పంట‌లు పండిస్తున్న ఆయ‌న అందరికీ స్ఫూర్తి దాయ‌క‌మంటూ కొనియాడారు. గుంటూరు జిల్లాలోని కొల్లిప‌ర మండ‌లం అత్తోట గ్రామానికి చెందిన రైతు రోశ‌య్య (Farmer Rosaiah)కు వ్య‌వ‌సాయం అంటే ఎంతో ఇష్టం. త‌న‌కు ఉన్న 75 సెంట్ల భూమిలో 52 ర‌కాల పంట‌లు పండిస్తున్నారు. అదీ స‌హ‌జ సిద్ధంగా ప్ర‌కృతి సేద్యాన్ని చేస్తుండ‌టం విశేషం. ఇలా సాగు చేసిన‌ పంట‌ను అమ్ముకుంటూ నెల‌కు రూ.20 వేల వ‌ర‌కు సంపాదిస్తున్నారు.

అంద‌రూ వృద్ధాప్యంతో విశ్రాంతి తీసుకునే వ‌య‌సులో రోశ‌య్య (Farmer Rosaiah) ఎంతో క‌ష్ట‌ప‌డి పంట సాగు చేయ‌డంపై సీఎం చంద్ర‌బాబు ఎంతో సంతోషం వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు ఆయ‌న ఎక్స్ వేదిక‌గా పోస్టు చేసి రోశ‌య్య‌ను అభినందించారు. భూమిని తల్లిలా భావించి… ప్రకృతి సేద్యంతో అద్భుతాలు సృష్టిస్తున్నారంటూ కొనియాడారు. రోశయ్య విజయగాధ అంద‌రికీ స్ఫూర్తిదాయమ‌ని చెప్పారు. 2016లో ఏపీలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి తాను తీసుకున్న చర్యలతో ప్రేరణ పొంది ప్రకృతి సాగు మొదలు పెట్టిన రోశయ్య సాధిస్తున్న విజయాలు ఆదర్శమ‌న్నారు.

Read Also: మైల‌వ‌రం మ‌ధ్యాహ్న భోజ‌నంపై స్పందించిన‌ మంత్రి లోకేశ్

Follow Us On : WhatsApp

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>