సంగారెడ్డిలో ఘోర ప్ర‌మాదం.. డివైడ‌ర్‌పైకి దూసుకెళ్లిన కారు!

కలం మెదక్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఓ కారు అదుపు త‌ప్పి డివైడ‌ర్‌పైకి దూసుకెళ్లింది. దీంతో కారులో ప్ర‌యాణిస్తున్న వాళ్లంద‌రికీ తీవ్ర గాయాల‌య్యాయి. నాందేడ్ – అకోలా జాతీయ రహదారిపై చౌటకూర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. మారుతి ఈకో వాహ‌నం అతివేగంతో అదుపుతప్పి డివైడర్‌ పైకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో వాహనంలో ఆరుగురు ప్రయాణిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌లో వీరంద‌రికి తీవ్ర గాయాల‌య్యాయి. వెంట‌నే స్థానికులు క్షతగాత్రులను సంగారెడ్డి జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసుల‌కు స‌మాచారం అందించారు. డివైడర్ పైకి దూసుకెళ్లిన కారును క్రేన్ సహాయంతో తొలగించారు. ప్ర‌స్తుతం క్ష‌త‌గాత్రుల‌కు చికిత్స కొన‌సాగుతోంది.

Read Also: బాసరకు కొత్త శోభ.. సర్కారు మాస్టర్ ప్లాన్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>