47 మంది మావోయిస్టుల లొంగుబాటు.. డీజీపీ కీలక విజ్ఞప్తి

కలం, వెబ్​ డెస్క్​ : తెలంగాణలో మావోయిస్టుల లొంగుబాటు (Maoists Surrender) కొనసాగుతోంది. ఈ క్రమంలో మరో 47 మంది నక్సలైట్లు రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy)​ ఎదుట ఆయుధాలను అప్పగించి జనజీవన స్రవంతిలో కలిశారు. ఈ సందర్భంగా డీజీపీ మీడియాకు వివరాలు వెల్లడించారు. లొంగిపోయిన వారిలో దండకారణ్య స్పెషల్​ జోనల్​ కమిటీ సభ్యుడు హేమ్లా అలియాస్​ విజ్జా, డివిజన్​ కమిటీ సభ్యుడు పోడియం లచ్చు అలియాస్ మనోజ్​తో సహా 47 మంది ఉన్నారు. అలాగే, 32 తుపాలకులతో పాటు 515 బుల్లేట్లను పోలీసులకు సరెండర్​ చేశారు. LMG,4 – AK-47 రైఫిల్​, SLR రైఫిల్స్ , INSAS రైఫిల్స్ రెండు, 410 మస్కెట్ రైఫిల్స్ రెండు, 8mm రైఫిల్, సింగిల్ షాట్ గన్స్​ 12, 9 mm పిస్టల్, రివాల్వర్​, BGL గన్స్ రెండు, ఎయిర్​ గన్స్​ 2, SBBL గన్ లు ఉన్నాయి.

అజ్ఞాతంలో ఉన్నవారు లొంగిపోవాలి..

అజ్ఞాతంలో ఉన్న తెలంగాణకు చెందిన నలుగురు మావోయిస్టులు లక్ష్మణరావు, పసునూరి నరహరి, జాడి రత్నా భాయ్, వార్త శేఖర్ లు లొంగిపోవాలని డీజీపీ శివధర్​ రెడ్డి (DGP Shivadhar Reddy)​ కోరారు. జనజీవన స్రవంతిలో చేరి తెలంగాణ ప్రభుత్వం పునరావాస విధానం ద్వారా లభించే అన్ని ప్రయోజనాలు పోందాలని విజ్ఞప్తి చేశారు. గత రెండు సంవత్సరాలలో 818 మంది నక్సలైట్లు తెలంగాణ పోలీసులు ముందు లొంగిపోగా.. 334 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ వెల్లడించారు.

Read Also: కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలి: కేటీఆర్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>