అమిత్ షా సిఫార్సు.. వద్దన్న రాహుల్ గాంధీ!

కలం, వెబ్ డెస్క్: కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ నియామకానికి సంబంధించి గతేడాది కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah), లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మధ్య జరిగిన చర్చల వివరాలు తాజాగా బయటకొచ్చాయి. ప్రధాని మోదీ సైతం పాల్గొన్న ఈ కమిటీ భేటీలో అమిత్ షా రాజ్ కుమార్ గోయల్ పేరును రాహుల్ ముందు ఉంచగా.. తిరస్కరించినట్లు సమాచారం. ఈయనకు బదులుగా జస్టిస్ మురళీధర్, ప్రొఫెసర్ ఫైజాన్ ముస్తఫా, సీనియర్ ఐఏఎస్ అధికారి సుమిత్రా దావా పేర్లను రాహుల్ గాంధీ సిఫార్సు చేశారు. చివరికి, కేంద్రం గోయల్ పేరునే ఖరారు చేసింది. అలాగే, మరో 8 మంది సమాచార కమిషనర్ల నియామకాల విషయంలోనే ఇలాగే బేధాభిప్రాయాలు తలెత్తాయి. చివరికి, ఏడుగురు పేర్లను ముగ్గురితో కూడిన కమిటీ ఓకే చేసింది.

ముగ్గురితో కూడిన కమిటీ అంగీకరిస్తేనే..

కీలక పదవుల నియామకాలను ప్రధాని, లోక్‌సభలో ప్రతిపక్ష నేతతో కూడిన కమిటీలు ఎంపిక చేయాల్సి ఉంటుంది. వాటిలో కీలకమైంది సీబీఐ డైరెక్టర్. ఈ ఎంపిక కమిటీలో వీరిద్దరితో పాటు సీజేఐ కూడా ఉంటారు. అలాగే, లోక్ పాల్ సభ్యుల నియామకం. ఈ కమిటీలో లోక్‌సభ స్పీకర్, సీజేఐ కూడా ఉంటారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్, ఇతర కమిషనర్ల నియామక కమిటీలో ప్రధాని, ప్రతిపక్ష నేతతో పాటు హోం మంత్రి (Amit Shah) కూడా ఉంటారు.

Read Also: క‌రీంన‌గ‌ర్‌లో ఎస్సై వీరంగం.. ‘అన్నా’ అన్నందుకు వ్య‌క్తిపై దాడి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>