రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు నిర్మల్ క్రీడాకారులు

కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని విజయ హైస్కూల్‌లో గత ఐదు రోజులుగా కబడ్డీ శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ శిబిరంలో పాల్గొన్న క్రీడాకారుల్లో ప్రతిభ కనబరిచిన 30 మంది విద్యార్థులను (Kabaddi Players) రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్టు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు భూపతిరెడ్డి బుధవారం తెలిపారు.

అక్టోబర్ 10, 11, 12 తేదీల్లో వేములవాడలో నిర్వహించనున్న జూనియర్స్ బాలబాలికల రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో వీరు పాల్గొననున్నారు. ఎంపికైన క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి సునీల్, కోశాధికారి ప్రేమలత, కోచ్ సునీల్‌, విజయ హైస్కూల్ కరస్పాండెంట్ భూషణ్, టీజీపీఈటీ కార్యదర్శి వన్నెల భూమన్న, టీఎస్‌పీఈటీ అధ్యక్షుడు అంబాజీ, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>