కలం, వెబ్ డెస్క్: ఉభయ సభల్లో తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం 2026-27ఆర్థిక సంవత్సరరానికిగాను బడ్జెట్-2026ను ప్రవేశపెట్టింది. శాసనమండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) రూ. రూ.3,24,234 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు.
రెవెన్యూ వ్యయం రూ.2,34,406 కోట్లు కాగా.. మూలధన వ్యయం రూ.47,267 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సభ్యుల మధ్య కౌన్సిల్‌లో ప్రవేశపెట్టారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం పద్దును ప్రవేశపెట్టే ముందు సంబంధిత కాపీలను మొదట గవర్నర్ శివప్రతాప్‌శుక్లా (Governor Shiv Pratap Shukla) కు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అందజేశారు.
ఆ తరువాత సీఎం రేవంత్‌రెడ్డికి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డిలకు కూడా భట్టి బడ్జెట్ కాపీలను అందజేశారు. అంతకుముందు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పోచమ్మ దేవాలయంలో బడ్జెట్‌కాపీలతో ప్రత్యేకపూజలు నిర్వహించారు. రాష్ట్ర ఆదాయం పెరగాలని అమ్మవారిని ప్రార్థించారు.

