ఐపీఎల్ 2026: చెన్నై డెత్ బౌలింగ్‌కు భారీ ఎదురుదెబ్బ!

కలం, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ నేథన్ ఎల్లిస్(Nathan Ellis) హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా ఈ ఏడాది టోర్నీ మొత్తం నుంచి దూరమయ్యారు. ఈ విషయాన్ని CSK సీఈఓ కాశీ విశ్వనాథన్ స్వయంగా ధృవీకరించారు. మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా (Aakash Chopra)  విశ్లేషణ ప్రకారం, ఎల్లిస్ లేకపోవడం వల్ల చివరి ఓవర్లలో బౌలింగ్ చెన్నైకు పెద్ద సవాలుగా మారనుందని తెలిపారు. గతంలోనే డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ మతీష్ పతిరాణ (Matheesha Pathirana)ను CSK వేలంలో విడుదల చేసింది. పతిరాణ ఫిట్‌నెస్ సమస్యల కారణంగా తీసుకున్న నిర్ణయం సరైనదే అయినప్పటికీ, ఇప్పుడు ఎల్లిస్ కూడా లేనుండటంతో జట్టు ఇబ్బందుల్లో పడింది.

వేలం సమయంలో ఎల్లిస్‌ను ప్రధాన డెత్ బౌలర్‌గా భావించిన CSKకు, ఇప్పుడు అతని స్థానాన్ని భర్తీ చేసే బౌలర్ ఎవరు అనే ప్రశ్న ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం చెన్నై జట్టులో మ్యాట్ హెన్రీ, జేమీ ఓవర్టన్, ముఖేష్ చౌదరి, ఖలీల్ అహ్మద్ వంటి బౌలర్లు ఉన్నారు. వీరితో పాటు అన్షుల్ కాంబోజ్, గుర్జాపనీత్ సింగ్ కూడా అందుబాటులో ఉన్నప్పటికీ, వీరిలో ఎవరూ డెత్ ఓవర్ల స్పెషలిస్టులు కావడం లేదు.

రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) నాయకత్వంలోని CSK తమ తొలి మ్యాచ్‌ను మార్చి 30న రాజస్థాన్ రాయల్స్‌తో ఆడనుంది. గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో ఈ పోరు జరగనుంది. కీలక బౌలర్ దూరం కారణంగా, మేనేజ్‌మెంట్ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేస్తుందో చూడాల్సి ఉంది. ఈ ఆకస్మిక పరిస్థితిని జట్టు ఎలా అధిగమిస్తుందో ప్రేక్షకులకు ఆసక్తికరంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>