Mobile Popup Ad
Mobile Popup Ad

భారీగా తాబేళ్ల పట్టివేత.. 12 బస్తాల్లో 263 తాబేళ్ల స్వాధీనం

కలం, వెబ్ డెస్క్: అటవీ శాఖ అధికారుల తనిఖీల్లో భారీగా అక్రమంగా తరలిస్తున్న తాబేళ్లు పట్టుబడ్డాయి. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ (Konaseema) జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ వద్ద అటవీ శాఖ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఓ బొలెరో వాహనంలో తాబేళ్లను తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ తనిఖీల్లో 12 బస్తాల్లో కుక్కి ఉన్న 263 తాబేళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రవాణాలో తలెత్తిన ఇబ్బందుల వల్ల బస్తాల్లో ఉన్న వారిలో 20 తాబేళ్లు (Turtles) అప్పటికే మృతిచెందాయి. అధికారులను చూడగానే నిందితులు తమ వాహనాన్ని అక్కడే వదిలిపెట్టి పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అటవీ శాఖ అధికారులు, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న తాబేళ్లను పోలీసులు చెరువులో వదలిపెట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>