ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలతో నాగార్జున సాగర్‌కు(Nagarjuna Sagar) వరద ఉధృతి భారీగా పెరిగింది. దీంతో వరద నీటిని కిందకు వదలడం కోసం అధికారులు 26 గేట్లను ఎత్తారు. ప్రస్తుతం జలాశయానికి 2.70 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. దీంతో ఔట్ ఫ్లో కూడా అంతే మొత్తంలో విడుదల చేస్తున్నట్లు చెప్పారు అధికారులు. సాగర్ కుది కాల్వకు 10,040 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 8,193 క్యూసెక్కులు, పవర్ హౌస్‌కు 33,291 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. స్విల్ వే ద్వారా 2.16 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం జలాశయంలో 587.30 అడుగుల నీటిమట్టం ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుతం 305.68 టీఎంసీలుగా నీటి నిల్వ ఉంది.
అయితే మరో నాలుగు ఐదు రోజుల పాటు తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ క్రమంలోనే అధికారులు అప్రమత్తమైన ముందస్తు చర్యలు చేపట్టారు. వరదలు రాకుండా ఉండటం కోసం నిండుకుండల్ల ఉన్న జలాశయాల నుంచి నీటికి దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే నాగార్జున సాగర్(Nagarjuna Sagar) నుంచి 26 గేట్లు ఎత్తి నీటికి దిగువకు వదులుతున్నారు.
Read Also: రేషన్ సరుకుల డోర్ డెలివరీ.. వృద్ధులు, దివ్యాంగులకు రిలీఫ్

