Mobile Popup Ad
Mobile Popup Ad

1983 వరల్డ్ కప్ పార్టీ నకిలీ బిల్లు.. కిర్తీ ఆజాద్ క్లారిటీ

కలం, వెబ్ డెస్క్ :  ఇండియా 1983 వరల్డ్ కప్ గెలిచినప్పటి ఒక హోటల్ బిల్లు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అయితే, ఆ బిల్లు పూర్తిగా నకిలీదని అప్పటి ప్రపంచకప్ విజేత జట్టు సభ్యుడు, మాజీ క్రికెటర్ కిర్తీ ఆజాద్ (Kirti Azad) స్పష్టం చేశారు. దీంతో గత కొన్ని రోజులుగా ఈ బిల్లు చుట్టూ తిరుగుతున్న పుకార్లకు తెరపడింది. కపిల్ దేవ్ కెప్టెన్సీలో భారత్ ప్రపంచకప్ గెలిచిన రాత్రి, లండన్ హోటల్‌లో జట్టు సభ్యులు పార్టీ చేసుకున్నట్లు ఈ బిల్లు సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. అందులో షాంపేన్, స్టీక్ డిన్నర్లు, సిగరెట్లు ఉన్నట్లు చూపించారు. అంతేకాదు, దానిపై కపిల్ దేవ్ సంతకం కూడా ఉండటంతో క్రికెట్ అభిమానులు ఇది నిజమేనని నమ్మారు.

కానీ, కిర్తీ ఆజాద్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఈ ప్రచారాన్ని ఖండించారు. జూన్ 25న మ్యాచ్ గెలిచిన తర్వాత తామంతా లండన్‌లోని వెస్ట్‌మోర్‌ల్యాండ్ హోటల్‌లోనే ఉన్నామని, వైరల్ అవుతున్న హోటల్‌కు అస్సలు వెళ్లలేదని ఆయన చెప్పారు. ఆ బిల్లుపై ఉన్న కపిల్ దేవ్ సంతకం కూడా నకిలీదేనని తేల్చి చెప్పారు. ఆజాద్ క్లారిటీ ఇచ్చిన తర్వాత నెటిజన్లు ఆ బిల్లును నిశితంగా పరిశీలించారు. అందులో చాలా తప్పులు బయటపడ్డాయి. బిల్లు మొత్తం 704 రూపాయలు అయితే, దానికి 10 శాతం సర్వీస్ ఛార్జ్ కింద 60.40 రూపాయలుగా వేశారు. నిజానికి అది 70.40 రూపాయలు ఉండాలి. అలాగే 1983 కాలంలో లేని రకరకాల ఫాంట్లు ఈ బిల్లులో వాడారని, ఇది ఏఐ (AI) సాయంతో సృష్టించిన నకిలీ బిల్లు అని నెటిజన్లు గుర్తించారు. గతంలో కూడా ఇలాంటి నకిలీ బిల్లులు కొందరు సెలబ్రిటీల పేరుతో వచ్చాయని గుర్తుచేశారు.

ఆ రాత్రి ఏం జరిగింది?

సీనియర్ జర్నలిస్ట్ విజయ్ లోకపల్లి ఒక పాడ్‌కాస్ట్‌లో అసలు విషయాన్ని పంచుకున్నారు. ఆ రాత్రి భారత్ గెలిచే సరికి లండన్‌లో చాలా హోటళ్లు మూతపడ్డాయి. దీంతో క్రికెటర్లు బయటకు వెళ్లి బర్గర్లు తింటూ సంబరాలు చేసుకున్నారు. ఆ సమయంలో డ్రైవర్ ఎక్కువ గంటలు బండి నడపడంతో పోలీసులు ఆపారు. తాము వరల్డ్ కప్ గెలిచామని చెప్పినా వినకుండా, ఆటగాళ్ల నుంచి ఆటోగ్రాఫ్‌లు తీసుకుని మరీ డ్రైవర్‌కు ఫైన్ వేశారు. ఈ వేడుకల్లో కొందరు పాకిస్తాన్ క్రికెటర్లు కూడా పాల్గొనడం విశేషం. ఈ 1983 నాటి విజయం భారత క్రికెట్ చరిత్రను పూర్తిగా మార్చేసింది. సచిన్, ద్రావిడ్, ధోనీ లాంటి ఎందరో స్టార్లకు ఇది స్ఫూర్తిగా నిలిచింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>