Mobile Popup Ad
Mobile Popup Ad

దారుణం.. 8ఏళ్ల బాలికపై 16 ఏళ్ల బాలుడి అత్యాచారం!

కలం, వెబ్​ డెస్క్: ఆంధ్రప్రదేశ్​ లో అత్యంత హేయమైన చర్య వెలుగులోకి వచ్చింది. చంద్రగిరి (Chandragiri) నియోజకవర్గ కేంద్రంలో 8 ఏళ్ల బాలికపై 16 ఏళ్ల బాలుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాధితురాలి కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. కూతురు హఠాత్తుగా అనారోగ్యం భారిన పడడంతో తల్లిదండ్రులు రూయా ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో పరీక్షలు నిర్వహించిన వైద్యులు బాలికపై అత్యాచారం జరిగినట్లు గుర్తించారు. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పక్కింటి మైనర్​ బాలుడే (16) ఈ దారుణానికి ఒడిగట్టాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>