రేపు నిజామాబాద్ జిల్లాకు మంత్రి ఉత్తమ్.. ఏర్పాట్లు పరిశీలించిన పోచారం

కలం, నిజామాబాద్ బ్యూరో : రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) ఈనెల 10 వ తేదీ బుధవారంనాడు నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. రూ. 106 కోట్లతో నిర్మించిన జాకోర చందూర్ ఎత్తిపోతల పథకాల ప్రారంభోత్సవం చేయనున్నారని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​ రెడ్డి వెల్లడించారు. అలాగే సిద్ధాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను పర్యవేక్షిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్​ రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు ఏర్పాట్లను పరిశీలించారు. హెలిప్యాడ్ స్థలం, సభా ప్రాంగణంను పరిశీలించారు. వర్ని చందూర్ మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పోచారం వెంట ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>