రేపు సీఎం కేరళం టూర్.. ఆ రాష్ట్ర సీఎంగా సతీషన్ ప్రమాణ స్వీకారం

కలం, తెలంగాణ బ్యూరో: కేరళం ముఖ్యమంత్రిగా సతీషన్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy), పలువురు రాష్ట్ర మంత్రులు సైతం హాజరు కానున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, ఆ రాష్ట్రానికే చెందిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తదితరులంతా ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతున్నారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి అక్కడి షెడ్యూలుకు అనుగుణంగా సోమవారం నేరుగా కేరళం వెళ్ళే అవకాశమున్నది. ఒకవేళ పనుల నిమిత్తం హైదరాబాద్ వచ్చినట్లయితే ఇక్కడి నుంచి కేరళం వెళ్తారు. కేరళం అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ముఖ్యమంత్రి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్యాంపెయిన్ చేయగా అక్కడ కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వారం రోజుల పాటు అక్కడే మకాం వేసి ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన పాల్గొన్న పది అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలిచింది.

‘నీ పో విజయన్’ ట్రెండ్ సెట్టర్ సీఎం రేవంత్‌రెడ్డి :

కేరళంలో కాంగ్రెస్ విజయం తథ్యమని పోలింగ్‌కు ముందుగానే తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అక్కడి ప్రజల ఆలోచన, మార్పును కోరుకునే ట్రెండ్‌ను చిట్ చాట్ సందర్భంగా రాష్ట్ర మీడియాకు వివరించారు. ఎలక్షన్ క్యాంపెయిన్‌లో ‘నీ పో విజయన్’ అనే డైలాగ్‌తో కేరళం ప్రజలను ప్రభావితం చేశారు. దీనికి తోడు తెలంగాణలో సక్సెస్ ఫార్ములాగా ఉన్న ఆరు గ్యారంటీలను ప్రచారం చేశారు. వాటి అమలులోనూ తెలంగాణ ఆదర్శంగా ఉన్నదని, వచ్చి చూసుకోవచ్చంటూ ఆ రాష్ట్ర సీఎం విజయన్‌కు పిలుపిచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి రూపొందించిన ‘నీ పో విజయన్’ స్లోగన్ అక్కడి రాష్ట్ర ప్రజల్లో సంచలనం సృష్టించింది. ప్రజలు మార్పును కోరుకుంటున్నారన్న సీఎం రేవంత్‌రెడ్డి అంచనా ఫలితాల రోజు రుజువైంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సతీషన్ ప్రమాణ స్వీకారానికి తెలంగాణ సీఎం హాజరు కానుండడం గమనార్హం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>