కలం, వరంగల్ బ్యూరో: వరంగల్ జిల్లా కేఎంసీ (KMC Warangal) ర్యాగింగ్ ఘటనలో 15 మంది సీనియర్ విద్యార్థులను 3 నెలల పాటు సస్పెండ్ చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కొద్ది రోజుల కిందట ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ విద్యార్థుల గురించి మూడో సంవత్సరం విద్యార్థులు వాట్సాప్ లో తప్పుగా మెసేజ్ లు పెట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సీనియర్స్ జూనియర్స్ ను పిలిచి ర్యాగింగ్ చేసినట్లు వార్తలు వినిపించాయి. దీంతో భాదితులు నేషనల్ మెడికల్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేశారు. స్పందించిన అధికారులు కారకులైన 15 మంది సీనియర్ విద్యార్థులను మూడు నెలల పాటు కళాశాల నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిసింది.

