Mobile Popup Ad
Mobile Popup Ad

జీవన్ రెడ్డి విషయం హైకమాండ్ డీల్ చేస్తే బాగుండు: జగ్గారెడ్డి

కలం మెదక్ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ కి విధేయుడు గా ఉన్న సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జీవన్ రెడ్డి (Jeevan Reddy) పార్టీని వీడటం బాధకరమని టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. జీవన్ రెడ్డి విషయం లో అంతర్గతంగా ఏం జరుగుతుందో ఏఐసీసి దృష్టి పెట్టవలసి ఉండాల్సిందన్నారు. డైరెక్ట్ గా డిల్లీ నాయకత్వమే నేరుగా రంగం లోకి దిగి సమస్యను పరిష్కరించి ఉంటే బాగుండేదని చెప్పుకొచ్చారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు జగ్గారెడ్డి. ఎమ్మెల్యే లు, నాయకులు పార్టీలు మారడం ప్రస్తుత రాజకీయాల్లో సహజమని, జీవన్ రెడ్డి పార్టీ మారడానికి గల కారణాలను బహిరంగంగా మీడియా తో బహిరంగ మాట్లాడాలేమని, పార్టీ లో అంతర్గతంగా చర్చిస్తామని వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>