Mobile Popup Ad
Mobile Popup Ad

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. 15 మంది మృతి

కలం, వెబ్​ డెస్క్​ : మహారాష్ట్ర (Maharashtra)లో బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ ప్రమాదం చోటుచేసుకున్నది. నాగ్‌పూర్ కటోల్​ ప్రాంతంలోని ఒక బాణాసంచా కర్మాగారంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో పదుల సంఖ్యలో కార్మికులు లోపల పనిచేస్తున్నారు. పేలుడు ధాటికి కర్మాగార భవనం పూర్తిగా ధ్వంసమైపోయింది. ఈ దుర్ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవాకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. పేలుడుకు గల కారణాలపై అధికారులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>