Mobile Popup Ad
Mobile Popup Ad

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విమాన సర్వీసులు రద్దు!

క‌లం, వెబ్ డెస్క్‌: హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ (Shamshabad Airport) నుంచి ప‌లు ప్ర‌దేశాల‌కు విమానాలు ర‌ద్ద‌యిన‌ట్లు డీజీసీఏ (DGCA) ప్ర‌క‌టించింది. ఇరాన్‌, ఇజ్రాయెల్, అమెరికా మ‌ధ్య నెల‌కొన్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపింది. దోహా, అబుదాబి, జెడ్డా, సౌదీ అరేబియాకు విమానాలు రద్దు చేశారు. ఇప్ప‌టికే ఎయిర్ ఇండియా మిడిల్ ఈస్ట్ దేశాలకు విమాన సర్వీసులు రద్దు చేసింది. ప్ర‌యాణికుల‌ భద్రతా పరిస్థితుల దృష్ట్యా డీజీసీఏ కీల‌క సూచ‌న‌లు చేసింది. ప్రయాణికులకు ముందుగా ఫ్లైట్ స్టేటస్ చెక్ చేసుకోవాలని, ఎయిర్‌లైన్ అధికారిక ఛానల్స్ ద్వారా మాత్రమే సమాచారం తెలుసుకోవాలని కోరింది. అన‌వ‌స‌రంగా ఎయిర్‌పోర్ట్ ద‌గ్గ‌ర‌కు రావొద్ద‌ని సూచించింది. ప్రయాణికులు టిక్కెట్లను మార్చడం, వాయిదా వేయ‌డం లేదా రీఫండ్ పొందడానికి ఎయిర్‌లైన్ కస్టమర్ కేర్‌ను సంప్రదించాల‌ని కోరింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>