Mobile Popup Ad
Mobile Popup Ad

జగిత్యాలలో విషాదం.. బావిలో పడి బాలుడు మృతి

కలం, కరీంనగర్ బ్యూరో: జగిత్యాల (Jagtial) జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. బుగ్గారం మండలం చిన్నపూర్ గ్రామానికి చెందిన 12 ఏళ్ల ఓర్స్ శివకుమార్ బావిలో పడి మృతిచెందాడు. బహిర్భూమికి వెళ్లి వస్తుండగా కాళ్లు, చేతులు శుభ్రం చేసుకునేందుకు గ్రామ శివారులోని బావి వద్దకు వెళ్లి.. ప్రమాదవశాత్తు అందులోకి జారి పడి మరణించాడు. మృతుడి తండ్రి ఓర్స్ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు ఎస్సై సతీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టo నిర్వహించారు. బాలుడి మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బహిరంగ బావుల చుట్టూ రక్షణ గోడలు ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>