కలం, వెబ్ డెస్క్: ఎన్టీఆర్, ఇందిరా గాంధీ స్ఫూర్తితోనే తాము ప్రజా పాలన సాగిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. హైదరాబాద్ అమీర్‌పేట్‌లోని మైత్రివనం చౌరస్తాలో 23 అడుగులు ఎన్టీఆర్ కాంస్య విగ్రహావిష్కరణ చేసి ప్రసంగించారు. తెలంగాణలో ఎందరో నాయకులకు ఎన్టీఆరే రాజకీయ అవకాశాలు కల్పించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టిందే ఆయన అన్నారు. ఎన్టీఆర్ పక్కా ఇళ్ల పథకమే.. ఇందిరా గాంధీ ఇళ్ల పథకానికి స్ఫూర్తి అన్నారు. హైదరాబాద్‌లో సైబరాబాద్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నగరాలు చంద్రబాబు హయాంలోనే నిర్మాణం జరిగినట్లు గుర్తు చేశారు.

