కలం, వెబ్ డెస్క్ : దైవభక్తి, కొండంత మనోబలం ఉంటే వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమేనని నిరూపించింది ఓ వృద్ధురాలు. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవాలనే కోరికతో, ఏకంగా 116 ఏళ్ల వయసులో ఆమె కాలినడకన తిరుమల కొండను చేరుకుని (Old Woman Climbs Tirumala) అందరినీ ఆశ్చర్యపరిచారు. నేటి తరం యువతకే ఎంతో శ్రమతో కూడుకున్న తిరుమల కాలినడక ప్రయాణాన్ని, ఆమె తన ముసలితనాన్ని పక్కనబెట్టి ఉత్సాహంగా పూర్తి చేయడం విశేషం.
మెట్లు ఎక్కుతున్న సమయంలో తోటి భక్తులు ఆమెను చూసి ఆశ్చర్యపోతూ, జేజేలు పలికారు. ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా, కేవలం తన శారీరక దృఢత్వం, విశ్వాసంతోనే ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేశానని ఆమె చాటిచెప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

