Mobile Popup Ad
Mobile Popup Ad

అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వండి.. ఎమ్మెల్యేకు TSJU వినతి

కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లాలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ సభ్యులు బీజేపీ ఫ్లోర్ లీడర్, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (MLA Alleti Maheshwar Reddy) ని కలిశారు. శుక్రవారం నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని ఆయన స్వగృహంలో టీఎస్‌జేయూ జిల్లా సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి, అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు.

వారి వినతిపై ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ, ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు రమేష్ శర్మ, ఉపాధ్యక్షుడు సురేష్, ప్రధాన కార్యదర్శి రాహుల్ గౌడ్, కోశాధికారి భీమేష్‌తో పాటు నిర్మల్, లక్ష్మణచాంద మండలాలకు చెందిన సభ్యులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>