Mobile Popup Ad
Mobile Popup Ad

ఎగ్జామ్స్ ఒత్తిడి తట్టుకోలేక టెన్త్ స్టూడెంట్ ఆత్మహత్య

కలం, వెబ్ డెస్క్ : ఎగ్జామ్స్ ఒత్తిడి తట్టుకోలేక మరో స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంచిర్యాల (Mancherial) జిల్లా మందమర్రిలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. స్థానికంగా నివాసం ఉంటున్న దంపతుల కుమారుడు లోకల్ స్కూల్ లో టెన్త్ క్లాస్ చదువుతున్నాడు. తాను కష్టపడి చదివినా సరే అన్ని ఎగ్జామ్స్ లో పాస్ మార్కులు మాత్రమే వస్తున్నాయని ఇప్పటికే చాలాసార్లు కుటంబసభ్యులకు చెప్పుకుని మనోవేదనకు గురయ్యాడు. మానసికంగా ఇబ్బంది పడుతున్న అతను.. ఆదివారం తెల్లవారు జామున తన ఇంట్లోని తన రూమ్ లో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తక్కువ మార్కులు వస్తున్నాయనే బాధతోనే ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>