108 అంబులెన్స్​ లో గర్భిణికి ప్రసవం

కలం, నిర్మల్​ : పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణికి 108 సిబ్బంది ప్రసవం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. నిర్మల్ (Nirmal) జిల్లా సారంగాపూర్ మండలం ఆదివాసిగూడ గ్రామానికి చెందిన తర్పే శివానంద అనే గర్భిణికి మంగళవారం పురిటి నొప్పులు రావడంతో 108 కు సమాచారం ఇచ్చారు. వెంటనే ఈఎంటీ సాగర్, పైలెట్ మహేష్ లు ఆమెను సారంగాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. అప్పటికే మరింత పురిటినొప్పులు ఎక్కువ కావడంతో కౌట్ల (బి) గ్రామ మార్గ మధ్యలో 108 వాహనంలోనే సురక్షితంగా నార్మల్ డెలివరీ చేయగా పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డలు క్షేమంగా ఉన్నారని అంబులెన్స్ సిబ్బంది తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>