స్కూల్ బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు

కలం, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌ (Meerut)లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు స్కూల్ పిల్లల బస్సు బోల్తా (School Bus Accident ) పడింది. బుధవారం ఉదయం సెయింట్ మేరీ అకాడమీకు చెందిన స్కూల్ బస్సు బోల్తా పడి 10 మందికి పైగా విద్యార్థులు గాయపడ్డారు. దౌరాలా ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు కాలువలో పడిపోవడాన్ని గమనించిన స్థానికులు, గ్రామస్తులు.. బస్సు అద్దాలు పగులగొట్టి పిల్లలను రక్షించారు. డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడిపాడని.. అందువల్లే ఈ ప్రమాదం జరిగిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

Read Also: విమానంలో వైన్ తాగుతున్నారా? జాగ్రత్త!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>