మరోసారి ట్రంప్ టారిఫ్ బాంబ్

కలం, వెబ్ డెస్క్: పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ (Donald Trump) ట్రంప్ మరోసారి టారిఫ్ బాంబు పేల్చాడు. ప్రపంచ దేశాలకు గట్టి హెచ్చరికలు జారీ చేస్తూ భారీ షాక్ ఇచ్చాడు. ఇరాన్‌కు సైనిక ఆయుధాలను విక్రయించే ఏ దేశమైనా సరే, అమెరికా నుంచి కఠిన ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన తేల్చి చెప్పాడు. ఈ మేరకు ఇరాన్‌కు (Iran) ఆయుధాలు సరఫరా చేసే దేశాల నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే అన్ని రకాల వస్తువులపైనా తక్షణమే 50 శాతం సుంకాలు (Tariffs) విధిస్తున్నట్టు ప్రకటించారు.

ఎలాంటి మినహాయింపులు లేకుండా ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని స్పష్టం చేశాడు. అమెరికా జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల రష్యా, చైనా వంటి ప్రధాన ఆయుధ ఎగుమతి దేశాలపై తీవ్ర ప్రభావం పడే ఉంది. ట్రంప్ (Donald Trump) నిర్ణయంతో మరోసారి అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది.

Read Also: విమానంలో వైన్ తాగుతున్నారా? జాగ్రత్త!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>