క్రికెట్‌లో విప్లవం.. ఒకే టీమ్‌లో ఉమెన్‌, మెన్‌!

క‌లం, స్పోర్ట్స్: క్రికెట్‌లో సరికొత్త ప్రయోగానికి భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ (Zaheer Khan) శ్రీకారం చుట్టారు. మహిళలు, పురుషులు కలిసి ఆడే మిక్స్‌డ్-జెండర్ టీ20 లీగ్‌ను ప్రారంభించనున్నారు. జహీర్ ఖాన్‌కు చెందిన యాంకర్ స్పోర్ట్స్ ఏబీ, జర్మన్ క్రికెట్ ఫెడరేషన్ కలిసి ఈ లీగ్ నిర్వహిస్తున్నాయి. ‘ఈక్వల్’ పేరుతో 2027 ఆగస్టులో జర్మనీలో మొదటి సీజన్ జరగనుంది. ఈ లీగ్‌లో మహిళా, పురుష ఆటగాళ్లు ఒకే తుది జట్టులో ఆడతారు. ఐదు జట్లు 12 టీ20 మ్యాచ్‌లలో తలపడతాయి. ప్రతి స్క్వాడ్‌లో 18 మంది ఉంటారు. తుది జట్టులో ఆరుగురు మహిళలు, ఐదుగురు పురుషులు ఉంటారు. ఆటగాళ్ల భద్రత, సబ్‌స్టిట్యూషన్ నిబంధనలను ఇందులో పొందుపరిచారు.

యూరప్ వంటి కొత్త మార్కెట్లలో క్రికెట్‌ను విస్తరించేందుకు ఈ లీగ్ ఉపయోగపడుతుందని జహీర్ ఖాన్ తెలిపారు. లింగ భేదం లేకుండా అందరికీ అవకాశం కల్పిస్తుందని చెప్పారు. 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్ తిరిగి వస్తున్న వేళ, కొత్త ప్రాంతాలకు ఆటను తీసుకెళ్లేందుకు ఇది తోడ్పడుతుందని అన్నారు. జర్మనీలో ఇప్పటికే మహిళలు, పురుషులు క్రికెట్ ఆడుతున్నారని జర్మన్ క్రికెట్ ఫెడరేషన్ అధ్యక్షుడు సెవెరిన్ వీబ్ పేర్కొన్నారు. వారందరినీ ఒకే వేదికపైకి తెచ్చేందుకు ఈ లీగ్ దోహదపడుతుందని తెలిపారు. క్రీడలో కొత్త అవకాశాలను అన్వేషించడమే లక్ష్యమని యాంకర్ స్పోర్ట్స్ సహ యజమాని నాగేంద్ర సిద్దౌతం చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>