ఉస్మానియాలో రోడ్డెక్కిన స్టూడెంట్స్‌.. ఎందుకంటే?

క‌లం, వెబ్‌డెస్క్‌: హైద‌రాబాద్‌లోని ఉస్మానియా యూనివ‌ర్సిటీ (Osmania University) వ‌ద్ద ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. తాగు నీటి కోసం చాక‌లి ఐల‌మ్మ మ‌హిళా యూనివ‌ర్సిటీ విద్యార్థినులు రాస్తారోకో చేప‌ట్టారు. కొద్ది రోజుల నుంచి వ‌ర్సిటీలో నీటి కొర‌త‌తో ఇబ్బందులు ప‌డుతున్న‌ట్లు విద్యార్థినులు చెప్తున్నారు. ఎన్నిసార్లు అడిగినా స‌మ‌స్య ప‌రిష్క‌రించ‌క‌పోగా, నిర్ల‌క్ష్య‌పు స‌మాధానాలు ఇస్తున్నార‌ని బుధ‌వారం రాత్రి హాస్టల్ ప్రధాన గేటు ముందు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.

త‌మ‌కు క‌నీస అవ‌స‌ర‌మైన తాగు నీటి విష‌యంలో ఇంత నిర్ల‌క్ష్యంగా ఎందుకు ఉంటున్నార‌ని వారు నిల‌దీశారు. త‌క్ష‌ణ‌మే వార్డెన్ త‌మ వ‌ద్ద‌కు రావాల‌ని డిమాండ్ చేశారు. త‌మ‌ సమస్య పరిష్కరించాలని నినాదాలు చేశారు. ​”వి వాంట్ వాటర్.. వార్డెన్ రావాలి” అంటూ విద్యార్థినులు నినాదాల‌తో హోరెత్తించారు. ​విద్యార్థినుల రాస్తారోకోతో రోడ్డుపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>