భారత్‌కు మరోసారి ట్రంప్ భారీ షాక్?

​కలం, వెబ్ డెస్క్: భారత్‌ అమెరికా వాణిజ్య (India US Trade) అంశంలో అధ్యక్షుడు ట్రంప్ మరోసారి సుంకాలతో షాక్ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. భారత్ నుంచి దిగుమతి అవుతున్న వస్తువులపై 17 శాతం టారిఫ్స్ విధించాలని అగ్రరాజ్యం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఈ జాబితాలో భారత్ సహా చైనా మరికొన్ని దేశాలు కూడా ఉన్నాయి. అయితే ఇవి ప్రస్తుతం ప్రతిపాదనల దశలోనే ఉన్నాయి. ఆయా దేశాలతో అమెరికా వాణిజ్య లోటు తగ్గించడంతో పాటు అక్కడ ఇస్తున్న సబ్సిడీల కారణంగా తమపై పడుతున్న భారాన్ని తొలగించుకునేందుకే ట్రంప్ మరోసారి సుంకాలతో చెలరేగే అవకాశం కనిపిస్తోందని వాణిజ్య నిపుణులు చెబుతున్నారు. వచ్చే నెలలో ప్రధాని మోదీ, ట్రంప్ భేటీ జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సుంకాల విధింపు ఉంటుందా.. లేదా.. అనేది ఆసక్తికరంగా మారింది.

భారత్ వస్తువులపై 25 శాతం పన్ను..

భారత్–అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిర్చే క్రమంలో జరుగుతున్న చర్చల్లో భాగంగా ఇండియా వస్తువులపై 25 శాతం అదనపు సుంకాలు విధించాలని అమెరికా ప్రతిపాదించింది. ప్రస్తుతం ఉన్న పది శాతం లేబర్ టారిఫ్‌కు ఇది అదనం కాదని.. ఈ రెండింట్లో ఏదీ తక్కువ ఉంటే అదే వర్తిస్తుందని చెబుతున్నారు. మోదీ, ట్రంప్ మధ్య చర్చల అనంతరం ఇది 17 శాతం వరకు తగ్గొచ్చని.. అప్పుడు కూడా భారత్‌పై అధిక భారం పడే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. అమెరికా వాణిజ్య ప్రతినిధులు మాత్రం చైనా, ఇతర దేశాలతో పోలిస్తే ఇండియాపైనే తక్కువ టారిఫ్స్ అని వాదిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>