epaper
Monday, March 2, 2026
epaper

విచారణకు హాజరైన ఎమ్మెల్సీ వెంకటరమణ

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్సీ (YSRCP MLCs) లను విచారణకి హాజరు కావాలని మండలి చైర్మన్ మోషెన్ రాజు (Moshenu Raju) నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీలు కల్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, మర్రి రాజశేఖర్‌లను ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని ఆదేశించగా.. ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణకు మాత్రం 25న విచారణకు రావాలని ఆదేశించారు. తాజాగా ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ (Jayamangala Venkata Ramana) మండలి చైర్మన్ మోషెన్ రాజు ఎదుట విచారణకు హాజరయ్యారు.

ఏడాది క్రితం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన వెంకట రమణ.. తన రాజీనామాను ఆమోదించాలని ఇప్పటికే పలుమార్లు మండలి చైర్మన్‌ను కోరారు. ఈ నేపథ్యంలో చైర్మన్ సమక్షంలో ఆయన హాజరై తన నిర్ణయాన్ని మరోసారి స్పష్టం చేశారు. తన రాజీనామాను స్వచ్ఛందంగా, ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా సమర్పించానని వివరించారు. రాజీనామా ప్రక్రియపై తగిన నిర్ణయం తీసుకోవాలని ఆయన చైర్మన్‌ను కోరారు.

Read Also:  ఇందూరులో హిందువులపై దాడులు ఆపండి.. డీజీపీని కలిసిన బీజేపీ బృందం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!