ఇందూరులో హిందువులపై దాడులు ఆపండి.. డీజీపీని కలిసిన బీజేపీ బృందం

కలం, నిజామాబాద్ బ్యూరో: ఇందూరు (Nizamabad) ఉమ్మడి జిల్లాలో హిందువులపై జరుగుతున్న దాడులపై బీజేపీ ప్రతినిధుల బృందం (BJP Leaders)  ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు బుధవారం హైదారాబాద్‌లో డీజీపీ శివధర్‌రెడ్డిని కలసి వినతిపత్రం అందించింది. రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్, ఎమ్మెల్సీలు కొమురయ్య, అంజిరెడ్డిలు డీజీపీని కలిసినవారిలో ఉన్నారు.

ఇందూరు (Nizamabad) బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి (Dinesh Patel Kulachari) మీడియాతో మాట్లాడారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ, రుద్రూర్, ఇందూర్ అర్బన్ పరిధిలోని మిర్చి కాంపౌండ్ తదితర ప్రాంతాల్లో కొంతమంది ముష్కరులు హిందువులపై ఉద్దేశపూర్వకంగా దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ విషయమై స్థానిక పోలీసు అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు.

హిందువులపై దాడులకు పాల్పడిన ముష్కరులు, సహకరిస్తున్నవారిని వెంటనే అరెస్టు డిమాండ్ చేశారు. బాధితుల నుంచి ఫిర్యాదులు వచ్చినప్పటికీ ఏమి పట్టన్నట్టుగా వ్యవహరించిన స్థానిక పోలీసు (Police) అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. భవిష్యత్తులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హిందువులకు గట్టి భద్రత కల్పించాలని బీజేపీ నేతలు విన్నవించారు.

Read Also:  క్షమించండి.. ఆ ఇద్దరితో ఎఫైర్ ఉంది : బిల్‌గేట్స్

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>