పవన్ కళ్యాణ్ విడాకులపై నో కామెంట్: అంబటి

కలం, వెబ్ డెస్క్: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్​ విడాకుల (Pawan Kalyan Divorce) అంశంపై తాను ఎలాంటి కామెంట్ చేయబోనని, అది ఆయన వ్యక్తిగత వ్యవహారమని వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) స్పష్టం చేశారు. కిర్లంపూడిలో పోలీసుల ఎదుట విచారణకు హాజరైన అనంతరం మీడియాతో మాట్లాడారు. ముద్రగడ అంత్యక్రియల సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ తనపై కేసు పెట్టారని వివరించారు. తాను ఏమైనా తీవ్రవాదినా.. గంటన్నర పాటు ప్రశ్నించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. పోలీసులు మంచి వాళ్లేనని.. డీజీపీ ఎలా చేయమంటే వాళ్లు అలా చేస్తున్నారని పేర్కొన్నారు. డీజీపీకి చంద్రబాబు, లోకేశ్​ చెబుతుంటారని మండిపడ్డారు.

వెనక్కి తగ్గబోం..

కూటమి ప్రభుత్వం వచ్చాక తనపైనా ఎన్ని కేసులు పెట్టారో లెక్కలేదని అంబటి రాంబాబు (Ambati Rambabu) ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టులున్నాయి కాబట్టి, తాము కొంత బయట తిరగుతున్నామని.. లేకపోతే సాయి కృష్ణను ఏం చేశారో, తమ పరిస్థితి ఉండేదన్నారని ఆరోపించారు. తమను ఎంత వేధించినా.. పారిపోయే ప్రశ్న లేదన్నారు. తమకు ఇంకో ఆప్షన్ కూడా లేదని.. పోరాడుతూనే ఉంటామన్నారు. ఇక ఇదిలా ఉంటే, పవన్ కళ్యాణ్ విడాకుల అంశంపై ఎలాంటి ప్రకటనలు, మీడియా సమావేశాల్లో మాట్లాడొద్దని వైసీపీ అధిష్ఠానం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అది ఆయన సొంత విషయమని.. అందులో జోక్యం చేసుకోవద్దని పార్టీ శ్రేణులకు సూచించింది.

Also Read : మంత్రులకు సీఎం చంద్రబాబు హెచ్చరికలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>