ఢిల్లీ టూర్ విజయవంతం.. బండి సంజయ్‌కు విద్యార్థుల కృతజ్ఞతలు!

కలం, కరీంనగర్ బ్యూరో: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Minister Bandi Sanjay) ను మంగళవారం ఉదయం కరీంనగర్ శ్రీ మహాశక్తి ఆలయం వద్ద జగిత్యాల జిల్లా మల్యాల చౌరస్తాలోని శ్రీ ప్రతిభ స్కూల్ విద్యార్థులు కలిశారు. ఇటీవల ఈ విద్యార్థులంతా ఢిల్లీ, ఆగ్రా టూర్ వెళ్లొచ్చారు. ఈ పర్యటనలో భోజన, వసతి, రవాణా సౌకర్యాలను కేంద్ర మంత్రి బండి సంజయ్ కల్పించారు. పార్లమెంట్, ప్రధానమంత్రి సంగ్రాలయం, ఆగ్రా వంటి అనేక చారిత్రాక ప్రదేశాలకు పంపించారు. తమ టూర్ విజయవంతంగా ముగించుకుని వచ్చిన ఆయా విద్యార్థులు కేంద్ర మంత్రిని కలిశారు.

“మీ వల్లే మా టూర్ విజయవంతమైంది. మీ సహకారంతో పార్లమెంట్, ప్రధానమంత్రి సంగ్రాలయం సహా అనేక చారిత్రాక ప్రదేశాలను చూడగలిగాం” అని పేర్కొంటూ కృతజ్ఞతలు తెలియజేశారు. ఢిల్లీ పర్యటనలో ఏమైనా లోటుపాట్లున్నాయా? అని ఆయా విద్యార్థులను కేంద్ర మంత్రి ఆరా తీశారు. ఎలాంటి లోటుపాట్లు లేవని, భోజన, వసతి, రవాణ సౌకర్యాలన్నీ అద్బుతంగా ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ఢిల్లీ టూర్ సందర్భంగా మీరేం నేర్చుకున్నారు? పార్లమెంట్‌లో రాజ్యసభను చూశారా? ఆ సభకు ఎవరు వెళతారు? ఆ సభకు ఛైర్మన్‌గా ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారు? ప్రధానమంత్రి సంగ్రాలయ వెళ్లారా? అక్కడ మిమ్ముల్ని ఆకర్షించేమిటి? ప్రధానితో ఫోటో దిగారా? అంటూ ప్రశ్నలు వేశారు. వాటికి విద్యార్థులు నవ్వుతూ సమాధానాలిచ్చారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. మీరంతా కష్టపడి చదివి ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. అక్కడున్న ఓ విద్యార్థి “ఢిల్లీలో మీ ఇల్లు చాలా బాగుంది” అని చెప్పడంతో కేంద్ర మంత్రి స్పందిస్తూ “మీ తల్లిదండ్రులంతా ఓటేసి గెలిపించడంవల్లే నేను ఎంపీనయ్యాను. మోదీ నన్ను కేంద్ర మంత్రిని చేయడంవల్లే అట్లాంటి అధికారిక నివాసంలోకి వెళ్లగలిగాను. మీరు కూడా కష్టపడి ప్రజలకు నిజాయితీగా సేవ చేస్తే పెద్దయ్యాక ఎంపీ అయ్యే అవకాశాలున్నాయి. ముఖ్యంగా మహిళలకు రాబోయే రోజుల్లో చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లను మోదీ కల్పించబోతున్నారు. ఇక్కడున్న అమ్మాయిలంతా కష్టపడి చదువుకుని ప్రజలకు సేవ చేస్తే ఎంపీ సీట్లు కూడా దక్కే అవకాశాలున్నాయి” అని చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>