కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి పట్టణ అభివృద్ధిలో భాగంగా అన్ని వార్డులు, కాలనీల్లో మౌలిక వసతుల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ (MLA Chinta Prabhakar) తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని 29వ వార్డు సిద్ధార్థ నగర్ కాలనీలో రూ.5 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. రహదారుల నిర్మాణంతో రాకపోకల్లో ఇబ్బందులు తగ్గుతాయని, కాలనీల్లో అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అన్నారు. నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. స్థానిక వార్డు కౌన్సిలర్ శ్రీకాంత్, నక్క నాగరాజు గౌడ్, కౌన్సిలర్ నవీన్, జాఫర్, సురేష్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

